calender_icon.png 6 November, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొగ్గు గనుల వద్ద ఏఐటీయూసీ ఆందోళన

06-11-2025 07:44:17 PM

బెల్లంపల్లి అర్బన్: పలు డిమాండ్ల సాధన కోసం సింగరేణి వ్యాప్తంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో గురువారం గనుల వద్ద ఆందోళన చేసి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ప్రధానంగా మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేసి, పాత విధానంలోనే ఇన్వాలిడేషన్ నిర్వహించాలనీ, మెడికల్ ఫిట్ అయిన డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలనీ,సింగరేణి ఉద్యోగుల సొంత ఇల్లు పథకం (Own Your Own House Scheme)ను అమలు చేయాలనీ, అలవెన్స్‌ల (Perks) పై విధించే ఆదాయపన్ను (Income Tax)ను కోల్ ఇండియా మాదిరిగా యాజమాన్యమే భరించాలనీ, మారుపేర్లతో ఉద్యోగాలు చేస్తున్న వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించి, విజిలెన్స్ ద్వారా విచారణ జరిపి పెండింగ్ లో ఉన్న వారికీ ఉద్యోగావకాశం కల్పించాలనీ, డిస్మిస్ ఉద్యోగులకు మరోక సారి ఉద్యోగావకాశం కల్పించాలనీ, డిసిప్లినరీ చర్యల కోసం 150 మస్టర్లు చేయాలనే సర్క్యులర్‌ను యాజమాన్యం వెంటనే రద్దు చేయాలనీ, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పరీక్షను తక్షణమే నిర్వహించాలనీ, ఓవర్మెన్ పాస్ అయిన సీనియర్ మైనింగ్ సర్ధార్లకు(DMH) డిప్లొమా హోల్డర్లకు ఓవర్మెన్ పదోన్నతి కల్పించాలనీ డిమాండ్ చేస్తూ శాంతిఖని, కాసిపేట గనుల్లో ఆందోళన చేశారు.

AITUC పిలుపుమేరకు  బెల్లంపల్లిలో మందమర్రి ఏరియా శాంతిఖని లో ఏఐటీయూసీ అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి మంతెన రమేష్ అధ్యక్షతన దాసరి తిరుపతి గౌడ్ పిట్ సెక్రటరీ  కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించి గని మేనేజర్  సంజయ్ కుమార్ సిన్హాకి డిమాండ్ల మెమోరండం అందజేశారు. ఈ కార్యక్రమoలో సహాయ కార్యదర్శి మంతెన రమేష్, బొంకురి రామచందర్, స్వామి దాస్, పొట్ల రాజలింగు, మిట్టపల్లి రమేష్, శ్రావణ్, దాడి రమేష్, భాస్కర్, ప్రవీణ్, సాధువుల శ్రీనివాస్,రాజేష్, టీ, రవి, వెంకటయ, అశోక్ఫక్రూడ,రామకృష్ణ, సేఫ్టీ కమిటీ సభ్యులు, మైన్స్ కమిటీ సభ్యులు, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్లు, టెంపుల్, క్యాంటీన్ కమిటీ సభ్యులు, రిలే సెక్రటరీ లు, కార్యకర్తలు పాల్గొన్నారు.