06-11-2025 07:41:45 PM
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కత్తి పద్మారావు..
సదశివానగర్ (విజయక్రాంతి): మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పై దాడి చేసిన వ్యక్తిని తక్షణమే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోని శిక్షించాలని, ఈనెల 17వ తారీకు రోజున తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ఒక్కొక్క జిల్లా చొప్పున వెయ్యి మంది ఢిల్లీకి తరలించాలని మందకృష్ణ మాదిగ పిలుపు ఇవ్వడం జరిగిందని, ఈ మేరకు సదాశివనగర్ మండలం పద్మజీవాడి ఎక్స్ రోడ్ లో సదాశివ నగర్ మండల్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.
ఢిల్లీకి పోవడానికి మన మండల నుండి కనీసం 50 మంది ముందుకు వచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో MRPS రాష్ట్ర నాయకులు కత్తి పద్మారావు, కామారెడ్డి జిల్లా మాజీ జిల్లా కార్యదర్శి కొత్తోల్ల యాదగిరి, జిల్లా నాయకులు పెద్దపురి గంగన్న, బాన్సువాడ మండల్ సీనియర్ నాయకులు డివిజన్ అధ్యక్షులు కొక్కొండ దాకయ్య,బొంపల్లి భూమేష్, పెద్దపురి విట్టల్, పరువయ్య, చిన్న లింగం, ప్రభాకర్, సిహెచ్ శీను సి,హెచ్ రాజయ్య తదితరులు పాల్గొన్నరు.