calender_icon.png 26 July, 2025 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జంక్ ఫుడ్‌తో జర జాగ్రత్త!

20-07-2025 12:00:00 AM

రేపు జంక్ ఫుడ్ వ్యతిరేక దినోత్సవం :

పాశ్చాత్య దేశాలు వంటింటికి ఎప్పుడో దూరమయ్యాయి. వారి ఇళ్లలో ఇప్పుడు జంక్ ఫుడ్స్‌కే చోటు. వారికి రోజులో ఒక్క పూటైన జంక్ ఫుడ్ లేకపోతే   ఎటూ పా లుపోదు. ‘జంక్’ అనే ఇంగ్లిష్ పదానికి వాస్తవార్థం ‘చెత్త’. ఈ చొప్పున జంక్ ఫుడ్ అంటే చెత్త ఆహారం అని అర్థం. 1950లో సూక్ష్మజీవ వాస్త్రవేత్త మైఖేల్ జాకబాసన్ మొదటిసారి జంక్‌ఫుడ్ అనే పదాన్ని వినియోగించాడు. అది కాస్త విశ్వవ్యాపితమైంది.

ఇప్పుడు అమెరికా కాదు, ఇండియా కాదు.. మారమూల ప్రాంతాలకూ జంక్ ఫుడ్ వ్యాపించింది. చిన్నా పెద్ద అందరూ జంక్ ఫుడ్, ఫాసెస్‌డ్ ఫుడ్ తినేందుకే ఇష్టపడుతున్నారు. అయితే.. ఆ ఫుడ్ మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో సగటు మనిషి జంక్ ఫుడ్‌ను ఆశ్రయిస్తున్న సంగతి వాస్తవమైనప్పటికీ, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమేనని వైద్యని పుణులు హెచ్చరిస్తున్నారు.

ధూమపానం కారణంగా ప్రపంచవ్యాప్తంగా యేటా సగటున 8 మిలియన్ల మంది మరణిస్తున్నారు. కానీ, జంక్ ఫుడ్ అతిగా తిని 11 మిలియన్ల మంది మరణిస్తున్నారంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జంక్ ఫుడ్ నిర్వచనమేంంటే.. ఏ ఆహార పదార్థాల్లోనైతే అధికంగా కొవ్వు, చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉంటాయో, అలాగే ఆ ఆహారంలో ఎక్కు వ క్యాలరీలు ఉంటాయో, దానిని మనం జంక్‌ఫుడ్ అనవచ్చు.

మానవాళి జంక్ ఫుడ్ ఎందుకు తింటున్నారని విశ్లేషిస్తే.. ఒక ఇంట్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం, వారికి వంట చేసేంత సమయం లేకపోవడం, దీంతో వారు జంక్‌ఫుడ్‌ను ఆశ్రయిస్తున్నట్లు డాక్టర్లు వెల్లడిస్తున్నారు, తల్లిదండ్రులను చూసి పిల్లలు కూడా అలాగే జంక్ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారని పేర్కొంటున్నారు. జంక్ ఫుడ్, డీప్ ఫ్రెస్, ప్రాసెస్‌డ్ ఫుడ్ అతిగా తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయంటే..

అతిగా జంక్ ఫుడ్ తినే వారు స్థూలకాయం లేదా అధిక బరువు బారిన పడవచ్చు. వారికి చిన్న వయస్సులోనే మధుమేహం రావొచ్చు. లో బీపీ, హై బీపీ వంటి సమస్యలు రావొచ్చు. దేహంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులకు దారి తీయవచ్చు. జీర్ణ సంబంధిత వ్యాధులు రావొచ్చు. చిన్న పనికి అలసట రావొచ్చు. ఏకాగ్రత లోపించవచ్చు. కొందరు క్యాన్సర్లు, కాలేయం/మూత్రపిండ సంబంధిత వ్యాధుల బారిన కూడా పడవచ్చు.

 డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి,

హైదరాబాద్.