15-10-2025 12:00:00 AM
ఎస్వీ రోహిత్ రాజ్, విజయ క్రాంతి కథనానికి ఎఫెక్ట్
మణుగూరు, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మంగళవారం మణుగూరు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. మంగళవారం విజయక్రాంతిలో ప్రత్యేకమైన ‘నాలుగో సింహం ఇష్టారాజ్యం ‘కథనానికి స్పందించి ఆయన ఆకస్మికతనికి నిర్వహించారు. డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డితో కలిసి స్టేషన్ను పరిశీలించారు. సుమారు గంటపాటు అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
సిబ్బందికి పలు సూచనలు అందించారు. స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. ప్రధానంగా నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా సమయ స్ఫూర్తితో వ్యవహరించాలని, పెండింగ్ కేసులపై అరా తీసి త్వరగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
నమోదు అయిన కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని, ప్రజా ఫిర్యాదులలో ఎటు వంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందిస్తూ ,ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు. సర్కిల్ పరిధిలో నేరాల నియంత్రణ కోసం రాత్రిపూట గస్తీని పెంచలన్నారు. ఎస్పీ వెంట డిఎస్పీ రవీందర్ రెడ్డి, సి.ఐ పాటీ నాగబాబు, ఎస్.ఐ, సిబ్బంది ఉన్నారు.