03-09-2025 04:23:28 PM
సిద్దిపేట రూరల్: ఇర్కోడ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొయ్యడ వీరమల్లారెడ్డి భౌతికదేహానికి సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ(Constituency In-charge Poojala Harikrishna) నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. పార్టీ కోసం వీరమల్లారెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని, కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా గంప మహేందర్, గుర్రం అంజిరెడ్డి, రెక్కల మహేందర్ రెడ్డి, ముద్దం లక్మి, కోడారి మల్లారెడ్డి, కిష్ట రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు.