calender_icon.png 5 September, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న సేవలో రాజమండ్రి ఇస్కాన్ ఆలయ అధ్యక్షుడు సత్య గోపీనాథ్ దాస్

03-09-2025 03:06:31 PM

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): దక్షిణ భారతదేశ ఇస్కాన్ ఆలయాల అధ్యక్షుడు, రాజమండ్రి ఇస్కాన్ ఆలయ గురువు సత్య గోపీనాథ్ దాస్(Iskcon Temple President Satya Gopinath Das) వేములవాడ రాజన్న ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రీతికరంగా కోడె ముక్కలు సమర్పించారు. అనంతరం, నాగిరెడ్డి మండపంలో వేదపండితులు, అర్చకులచే ఆశీర్వచనం పొందారు. ఆలయ పర్యవేక్షకులు జి. శ్రీనివాస్ శర్మ సత్య గోపీనాథ్ దాస్ శేషవస్త్రం సమర్పించి, లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీకాంత్ చార్యులు, సీనియర్ అసిస్టెంట్ బోడుసు మహేష్ బీసీ జిల్లా సంఘం నాయకులు, కాసర్ల అరుణ్  ఉన్నారు.