03-09-2025 04:34:39 PM
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలోని నెహ్రు ఇండోర్ స్టేడియం నందు 5 రోజుల పాటు జరిగిన జాతీయస్థాయి కిక్ బాక్సింగ్(National level kickboxing) పోటీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి 5 గురు విద్యార్థిని విద్యార్థులు మాస్టర్ వోడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరచి ద్వితీయ వెండి, తృతీయ కాంస్య పతకాలు సాధించి సిరిసిల్ల జిల్లాకే గర్వకారణంగా నిలిచారు. క్రియేటివ్ ఫామ్ వెపన్ ఓల్డర్ కెడేట్ బాలికల విభాగంలో గజ్జెల శ్వేదిక ద్వితీయ స్థానం పొంది వెండి పథకం సాధించింది, అలాగే యంగర్ కెడేట్ బాలుర విభాగంలో పాయింట్ ఫైట్, లైట్ కాంటాక్ట్ ఫైట్ ఈవెంట్లో గౌతమ్ ఆనంద్ రెండు తృతీయ స్థానాలు పొంది రెండు కాంస్య పథకాలు సాధించడం జరిగింది.
అలాగే ఐదు దవ స్థానం, కర్నె యుతిక, చోడిబోయిన శివష్, షేక్ అజహన్ మోహిద్దీన్ లు కింది వరుసలో ఉన్నారు.పథకాలు సాధించిన కిక్ బాకర్లను వాకో ఇండియా కిక్ బాక్సింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్ అగర్వాల్, తెలంగాణా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు, జనరల్ సెక్రటరీ మహిపాల్, క్యాషియర్ పన్నీరు శ్రీనివాస్. ప్రిన్సిపాల్ శ్యామ్, భాస్కర్ రెడ్డి, కిక్ బాక్సర్ల తల్లిదండ్రులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కిక్ బాక్సర్లను ఎంతగానో ప్రోత్సహించి జాతీయస్థాయి పోటీలకు పంపించిన కిక్ బాక్సర్ల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తీయజేయడం జరిగిందని స్పోర్ట్స్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రటరీ వోడ్నాల శ్రీనివాస్ తెలిపారు.