03-09-2025 03:13:04 PM
తూప్రాన్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల జారీని అమలుపరిచింది. ఇందులో భాగంగా తూప్రాన్ మండలం యావపూర్ గ్రామంలో మంజూరైన రేషన్ కార్డుల పత్రాలను ప్రతి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీటీసీ ఎంజాల స్వామి వీరితో పాటు కాంగ్రెస్ మిత్ర బృందం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు స్వామి మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న ఒక రేషన్ కార్డు ఇవ్వలేని దుస్థితిని తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులను మంజూరు చేసి మాట నిలబెట్టుకున్నదన్నారు. ఇందులో సెక్రటరీ అరుణ, కుతాడి నరసింహులు, చెట్లపల్లి రామస్వామి, ఏంజాల బిక్షపతి, బిక్షపతి రెడ్డి, కావేరి బిక్షపతి, చాకలి బాలకృష్ణ, సిహెచ్. స్వామి, నర్సింగరావు డీలర్ పెంటయ్య తదితరులు ఉన్నారు.