21 August, 2026 | 5:03 AM

ఆయిల్‌పామ్ సాగు రైతులకు మేలు

21-08-2026 01:44 AM

నిర్మల్ ఆగస్టు 20 ( విజయ క్రాంతి)ఆయిల్ పామ్ సాగుతో రైతులకు ఎంతో మేల ని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ రూరల్ మం డలం ముజ్గి గ్రామంలో రైతు మల్లయ్య సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటను ఆయ న పరిశీలించారు.

ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పంట పరిస్థితిని పరిశీలించి, సాగు విధానం, పెట్టుబడి, దిగుబడి, నిర్వహణ తదితర వివరాలను రైతును అడిగి తెలుసు కున్నారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. ఆయిల్ పామ్ పంట రైతులకు మంచి వాణిజ్య పంటగా మారుతోందన్నారు. ఒకసారి ఆయిల్ పామ్ మొక్కలు నాటిన తర్వాత సుమారు 25 సంవత్సరాల వరకు దిగుబడి పొందే అవకాశం ఉంటుందని వివరించారు.ఈకార్యక్రమంలోరైతులు ఉన్నారు.