calender_icon.png 9 July, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌పై విమర్శలు మాని.. ఇసుక దందాల ఆరోపణలపై మంత్రి సీతక్క సమాధానం చెప్పాలి

08-07-2025 11:47:05 PM

మాజీ ఎంపీ మాలోత్ కవిత

హైదరాబాద్ (విజయక్రాంతి): ములుగులో మంత్రి సీతక్క(Minister Sitakka) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, కేటీఆర్‌పై సీతక్క శాపనార్థాలు పెట్టడం ఏమిటీ అని బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ మాలోత్ కవిత(Former MP Maloth Kavitha) అన్నారు. సీతక్క మీద కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారని, మావోయిస్టులు కూడా సీతక్కపై లేఖ విడుదల చేశారన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ఆదివాసి కార్డు అడ్డం పెట్టుకుని ఏదీ మాట్లాడినా చెల్లుతుందా అని, రీల్స్ కే సీతక్క పనికొస్తారు తప్ప మంత్రిగా పనికిరారన్నారు. సీతక్క వ్యతిరేకంగా సోషల్ పోస్టులు పెడితే సీతక్క తన మనుషులతో కొట్టిస్తోందని, సీతక్క  శాపాలకు ఉట్లు తెగేది లేదని కవిత ఫైర్ అయ్యారు. సీతక్క ఇప్పటికైనా పాలన మీద ద్రుష్టి పెట్టాలని ఆమె హితవు పలికారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.