calender_icon.png 3 July, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి బల్దియా రోడ్లకు మహర్దశ..

18-06-2025 12:00:00 AM

ఎమ్మెల్యే గడ్డం వినోద్

బెల్లంపల్లి అర్బన్, జూన్ 17: బెల్లంపల్లి నియోజక వర్గం కేంద్రంలోని బెల్లంపల్లి మున్సిపాలిటీ రహదారులకు మహర్దశ వరించింది. రూ. ఐదు కోట్ల నిధులతో రహదారులు, సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులకు మంగళవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శంకుస్థాపన చేశారు.బెల్లంపల్లి పట్టణంలోని రూ. 2 కోట్లతో నిర్మించే గాంధీ విగ్రహం నుంచి పోచమ్మ టెంపుల్ వరకు రెండు వరుసల బీటీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపనచేశారు.

బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తిలో రూ. కోటి నిధులతో సిమెంట్ రోడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ఏఎంసీ చౌరస్తా వరకు రూ. 2 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ పనులను ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు. బెల్లంపల్లి పట్టణం 13వ వార్డులో నూతనంగా నిర్మించ తలపెట్టిన ఇందిరమ్మ ఇండ్లకి ఎమ్మెల్యే గడ్డం వినోద్ భూమి పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు మంజూరైన ఇండ్లకు పొజిషన్ పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కలనెరవేరుస్తున్నామన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నామని వెల్లడించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో 3500 ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, తాసిల్దార్ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, అధికారులు, తాజా మాజీ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, కాంగ్రెస్ నాయకులు చిలుముల శంకర్, ము మునిమంద రమేష్, ముచ్చర్ల మల్లయ్య, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు, లబ్ధిదారులు, అధికారులు  పాల్గొన్నారు.