03-07-2025 08:23:07 PM
వలిగొండ (విజయక్రాంతి): బీసీ సంక్షేమ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District) ప్రధాన కార్యదర్శిగా వలిగొండ మండలం నాగారం గ్రామానికి చెందిన పంజా సజావర్ అలీ సజ్జు భాయ్ ని నియమిస్తూ బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు ఆలకుంట్ల ఎల్లయ్య గురువారం నాగారం గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బలహీన వర్గాలకు న్యాయం జరిగేంత వరకు వివిధ పద్ధతులలో ఉద్యమాలు చేయడమే తమ విధానం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయడం లేదని 76 ఏళ్ల తర్వాత కూడా చట్టసభలలో వాటా కోసం పోరాడాల్సిన పరిస్థితి ఉందన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సజావుగా జరగాలని అన్నారు.
చట్టసభల్లో 50 శాతం వాటా కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని, గ్రామా మండల జిల్లా కమిటీలు వేసి బీసీ సంఘాలను మరింత పటిష్టం చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని ఎల్లయ్య పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి పంజా సజ్జు భాయ్ మాట్లాడుతూ... తన నియామకానికి సహకరించిన జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యకు జాతీయ ఉపాధ్యక్షులు ఆలకుంట్ల ఎల్లయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఈ పదవి బాధ్యతలు అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. బీసీ సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి శాయశక్తుల కృషి చేస్తానని బీసీ కులాల ఐక్యత కోసం బీసీల హక్కుల సాధన కోసం వారి సంక్షేమానికి అభ్యున్నతికి నా వంతుగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బెలిదే నాగేశ్వర్, పోలు నాగయ్య, పలుసం రాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.