calender_icon.png 4 July, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవుల మనుగడకు మొక్కలే ప్రాణాధారం

03-07-2025 08:20:35 PM

ఇంటింటా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి..

కలాం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సర్వర్ అహ్మద్..

వెంకటాపూర్ ఎస్సై చల్ల రాజు..

ములుగు/వెంకటాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతం చేయాలని వెంకటాపూర్ మండల పరిషత్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎస్సై చల్ల రాజు అన్నారు. లక్ష్మీదేవిపేట పాఠశాల ఆవరణలో కలాం ఫౌండేషన్(Kalam Foundation) ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మొక్కలు మానవ మనుగడకు ఎంతో దోహదపడుతాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఇంటింటా మొక్కలు నాటాలని వారు పిలుపునిచ్చారు. మొక్కల యొక్క ఆవశ్యకతను విద్యార్థులు తమ తల్లిదండ్రులకు వివరించాలని వారు సూచించారు.