03-07-2025 08:30:32 PM
దౌల్తాబాద్ (విజయక్రాంతి): ఇల్లులేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు(Congress Party Mandal President Padala Ramulu) అన్నారు. గురువారం మండల పరిధిలోని మాచినపల్లి, చెట్ల నర్సంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... లబ్ధిదారులు వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన నిలిచి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టినట్లు తెలిపారు. దశల వారిగా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మద్దెల స్వామి, నాయకులు దుద్దెడ స్వామి, మల్లేశం, నాగరాజు ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.