16-08-2024 10:52:33 AM
హుస్నాబాద్: ప్రతిరోజు ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏఎన్ఎం ఎర్ర సునీతకు జిల్లాస్థాయి ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. కోహెడ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బస్వాపూర్ హెల్త్ సబ్ సెంటర్లో ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తున్న సునీత ప్రతిరోజు గ్రామంలోని గర్భిణీలకు బాలింతలకు తగిన సూచనలు సలహాలు ఇస్తూ అవసరమైన మాత్రలు అందజేస్తుంది. గ్రామస్తులు సునీత చేస్తున్న సేవలను గుర్తు చేస్తూ ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు. కోహెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రకాష్ సునీత సేవలను జిల్లా ఉన్నతాధికారులకు నివేదించారు. సున్నిత సేవలను గుర్తించిన జిల్లా కలెక్టర్ ఉత్తమ ఉద్యోగిగా ప్రకటించారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ మను చౌదరి సునీతకు ఉత్తమ ఉద్యోగి అవార్డు అందజేసి అభినందించారు.