calender_icon.png 21 November, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ రెండోవారంలో!

21-11-2025 12:47:38 AM

  1. ఈనెల 24, 25 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల! 
  2. జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్
  3. పకడ్బందీగా నిర్వహించాలని సూచన

హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి) : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూ ల్‌ను విడుదల చేసేందుకు రాష్ర్ట ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. వచ్చే వారం ఈ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలు స్తోంది. ఈ నెల 24 లేదా 25వ తేదీన పంచాయతీ ఎన్నికల నగారా మోగే అవకాశాలున్నాయి. మొత్తం మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది.

డిసెం బర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచా రం. ఈ ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో రాష్ర్ట ఎన్నికల కమిషన్ వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ ఎన్నిక లను చాలా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. దీనికితోడు పంచాయతీల్లో ఓటరు జాబితా మరోసారి సవరణకు రాష్ర్ట ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ ప్రకటించిన క్రమంలో గురువారం నుంచి నవంబర్ 23వ తేదీ వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించింది.

20వ తేదీన ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, తప్పుల సవరణ చేయనుంది. 21వ తేదీన ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరిస్తుంది. 23వ తేదీన ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని రాష్ర్ట ఎన్నిక ల సంఘం బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ర్ట ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

డిసెంబర్ 1 నుంచి 9 వ తేదీ వరకు నిర్వహించే ప్రజాపాలన వారోత్సవాల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో ఈ ప్రక్రియపై పంచాయతీరాజ్ శాఖ, ఎన్నికల సంఘం దృష్టి సారించాయి. వచ్చే ఏడాది మార్చి 31 లోపు ఎన్నికలు నిర్వహిస్తేనే.. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదల అవుతాయి. 

రిజర్వేషన్లు 50 శాతం మించొద్దు..

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటె డ్ కమిషన్ రాష్ర్ట ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పంచాయతీలు, వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించకుండా సిఫారసు చేసింది. డెడికేటెడ్ కమిషన్ ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. ఈనెల 24న హైకోర్టు విచారణకు ముందే ఈ ప్రక్రియను పూర్తిచేయ నుం ది. ఈనెల 24 లేదా 25న షెడ్యూల్ ప్రకటించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. 12,7 33 పంచాయతీ, 1,12,288 వార్డుల్లో డిసెంబరు 16 వరకు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది.