21-09-2025 12:00:00 AM
ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బహుమతులు
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలుగు వికాసంపై నిర్వహించిన లఘు చలన చిత్ర పోటీలలో పెద్ద బాల శిక్షకు ప్రథమ బహుమతి, ఉనికి, తెలుగు వైభవం చిత్రాలకు ద్వితీయ, తృతీయ బహుమతులు, సుమధురం, కాసేపు తెలుగులో మాట్లాడుకుం దాం, మహాశయులు మళ్ళీ పుట్టాలి చిత్రాలు ప్రత్యేక ప్రశంసా బహుమతులు గెలుచుకున్నాయి.
ఉత్తమ దర్శకుడుేొఉనికి, అభిజి త్‌సాయిరెడ్డి, ఉత్తమ రచన మరియు శ్వాస, వజ్రనాభ నటరాజ్ మహ ర్షి, ఉత్తమ నటి తెలుగు తల్లికి మల్లెపూదండ నర్తకి, ఉత్తమ నటుడు బాలశి క్ష, ఉదయ్ భాగవతుల, ఉత్తమ ఛాయాగ్రహ ణం - మధులిక- అభి, ఉత్తమ కూర్పు సూర్య అకొండి, తెలుగు వైభవంకు వ్యక్తిగత ప్రతిభా బహుమతులు గెలుచుకున్నారని ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్, ముఖ్య సమన్వయకర్త పి. రామచంద్రరాజు తెలిపారు. పోటీల జ్యూరీ చైర్మన్ గా లోహిత్ కుమార్, సభ్యులుగా సాకేత్ ఉదయగిరి, లిరేష కూనపరెడ్డి నిర్వహించా రు.
తొలుత తెలుగు చలన చిత్ర ప్రముఖులు కోన వెంకట్, దర్శకులు దశరథ్, బి.వి ఎస్.రవి, సిరాశ్రీ, మన చౌదరిలను వొకేషనల్ ఎక్సలెన్సీ అవార్డును రోటరీ క్లబ్ గుం టూరు ప్రదానం చేసింది. విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు పొడపాటి తేజ స్విని, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రామప్రసాద్, పరిషత్ నిర్వాహకులు రెడెప్ప ధవేజ్, మేడికొండ శ్రీనివాస్, అన్నా ప్రగడ రవి శ్రీనివాస్, డా. కత్తి వెంకటేశ్వరావు, వాసిరెడ్డి విద్యాసాగర్, సునీత పాల్గొన్నారు.