calender_icon.png 21 September, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీటి కోసం మహిళల నిరసన

21-09-2025 12:00:00 AM

రహదారిపై ఖాళీ బిందెలతో ఆందోళన

కాగజ్‌నగర్, సెప్టెంబర్ 20 (విజయక్రాం తి): ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజక వర్గంలోని కాగజ్‌నగర్ మండలం వంజీరి గ్రామ పంచాయతీ మహిళలు మంచినీటి ఎద్దడి తీర్చాలంటూ ఆందోళన చేపట్టారు. శనివారం ఫారెస్ట్ చెక్‌పోస్ట్ సమీపంలో ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. గత కొన్ని రోజులుగా కుళాయిల ద్వారా నీటి సరఫరా లేక తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మహిళలు ఆరో పించారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో కోట ప్రసాద్ గ్రామస్థులతో మాట్లాడారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ట్యాంకరు ద్వారా నీటి సరఫరా చేస్తున్నప్పటికీ ధర్నా చేయడం సరికాదని, నీల్లు సరిపోకపోతే అదనంగా ట్యాంకర్లు ఏర్పాటు చేస్తామన్నారు. పంచాయతీ పరిధిలోని సిఆర్ నగర్, మహజన్ గూడ గ్రామాల్లో బోరుబావులు లేనం దున మంజూరు చేయించవలసినదిగా మహిళలు కోరారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో భరో సా ఇచ్చారు. 

రూరల్ సీఐ కుమారస్వామికి గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు.  అధికా రుల స్పష్టమైన హామీతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ అంతరం ఏర్పడింది.