20-09-2025 11:55:49 PM
మందమర్రి,(విజయక్రాంతి): కోల్ ఇండియా చైర్మన్ గా బి సాయిరాం ఎంపిక అయ్యారు. కోల్ ఇండియా చైర్మన్ పదవి కోసం శనివారం న్యూఢిల్లీలో ఇంటర్వ్యూలు నిర్వహించగా ఎంపిక చేసిన 10 మంది అధికారులు హాజరయ్యారు. ఇంటర్వ్యూల అనంతరం కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) నూతన ఛైర్మన్ గా బి సాయిరాంను పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ (పిఈఎస్బి) సిఫార్సు చేసింది.
మొత్తం పదిమంది అధికారులు కోల్ ఇండియా చైర్మన్ పదవికి పోటీ పడగా కోలిండియా ఛైర్మన్ పదవి సాయిరామ్ ను వరించింది. ప్రస్తుతం నార్తర్న్ కోల్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) బాధ్యతలు నిర్వహిస్తున్న సాయిరామ్ ఛైర్మన్ గా ఎంపిక కావడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.ఇదిలా ఉండగా కోల్ ఇండియా ప్రస్తుత చైర్మన్ పిఎం ప్రసాద్ పదవీకాలం అక్టోబర్ 31, 2025 వరకు ఉంది.