calender_icon.png 7 January, 2026 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ నాయకులను దూషిస్తే ఖబడ్ద్దార్

06-01-2026 01:20:13 AM

  1. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం  హామలుచేస్తుంది

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి హెచ్చరిక

నిజామాబాద్, జనవరి 5,(విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని  అవమానించే నైతిక హక్కు టిఆర్‌ఎస్ పార్టీకి లేదని. తమ నాయకుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ అని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి కేటీఆర్ ను ఆ పార్టీ నాయకులను హెచ్చరించారు.  ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి ని కేటిఆర్ అవమానించడం అంటే ఆది కేటీఆర్ అవివేకానికి,  అహంకారానికి నిదర్శనం అన్నారు.     సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో జిల్లా పార్టీ అధ్యక్షులు కట్పల్లి నగేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించరు. 

తమ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదు అని కేటీఆర్ అబద్ధపు ప్రచారం చేస్తున్నాడని,గతంలో బి ఆర్‌ఎస్ అధికారంలో రాకముందు దళితులకు మూడు ఎకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి, ప్రతి పేదవానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆయన ఆరోపించారు. టిఆర్‌ఎస్ హయాంలో ఎ ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చలేదు అని నగేష్ రెడ్డి అన్నారు.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పినా హామీల మేరకు అధికారంలోకి రాగానే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు అందించారన్నారు, ఇల్లు లేని పేదలకు ఇందిర ఇండ్లు మంజూరు చేయడం తోపాటు,  22 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేయడం తమ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు, రైతులందరికీ ప్రతి సంవత్సరం రూ:12 వేల, రైతుబంధు అందించడం తో పాటు, సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తోందనన్నారు.

రేషన్ దుకాణాలలో సన్న బియ్యం ఇస్తోందని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రతి హmi నెరవేస్తోందని నగేష్ రెడ్డి తెలిపారూ. కేటీఆర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి పైన అనుచిత వాక్యాలు చేసే స్థాయి లేదు అని, కేటీఆర్ చేసిన వాక్యాలను నగేష్ రెడ్డి ఖండించారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా కేవలం ఫామ్ హౌస్ లోనే ఉంటూ ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం సరైనది కాదు అని, ప్రజలలో ఉంటేనే ప్రభుత్వం పని చేస్తుందో చేయట్లేదు తెలుస్తుంది అని,

ఇటీవల కెసిఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మానవతా దృక్పథంతో ఆయన దగ్గరికి వెళ్లి మరి కరచాలనం చేసి మాట్లాడడం జరిగిందని ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి నిదర్శనమని, కానీ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చినప్పుడు కూడా నిలబడని కేటీఆర్ సంస్కారహీనుడని.ప్రజలందరూ గమనించారని కేటీఆర్ కేవలం అహంకార ధోరణితో ఇంకా తగ్గలేదు అన్నారు.

కాంగ్రెస్ నాయకులపై అనుచిత వాక్యాలు చేస్తే టిఆర్‌ఎస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీస్తామni మహేష్ రెడ్డి హెచ్చరించారు.ఈ సమావేశంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతారెడ్డి రాజారెడ్డి, ప్రచార కమిటీ సభ్యులు జావిద్ అక్రమ్, సేవదల అధ్యక్షులు సంతోష్, ఎన్‌ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు యాదగిరి, వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డి, రాజేందర్, శోభన్, కౌశిక్, దేగం గంగారెడ్డి, గణేష్  తదితరులు పాల్గొన్నారు.