calender_icon.png 7 January, 2026 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాహితీపై 17 చార్జిషీట్లు

06-01-2026 01:19:08 AM

  1. ప్రీలాంచ్ పేర రూ.3 వేల కోట్ల భారీ కుంభకోణం
  2. ప్రాజెక్టుల సొమ్ము సొంతానికి మళ్లించిన సంస్థ ఎండీ సాహితి లక్ష్మీనారాయణ 
  3. ఆయనతోపాటు 13 మందిపై సీసీఎస్ ఛార్జిషీట్ 
  4. మొత్తం 64 కేసులు.. 17 కేసుల్లో అభియోగాలు 

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 5 (విజయక్రాంతి): మధ్యతరగతి ప్రజల సొంతిం టి కలను ఆసరాగా చేసుకుని, ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరిట రూ.3 వేల కోట్లు కొల్లగొట్టిన సాహితి ఇన్ఫ్రా కేసులో ఎట్టకేలకు కీలక ముందడుగు పడింది. నాలుగేళ్ల సుదీర్ఘ విరా మం తర్వాత సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఈ మెగా స్కామ్‌పై న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు. అమాయక ప్రజలను నమ్మించి, వారి నుంచి వసూలు చేసిన రూ.3 వేల కోట్లను సంస్థ ఎండీ సాహితి లక్ష్మీనారాయణ దారి మళ్లించినట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు.

అసలేం జరిగింది

సాహితి ఇన్ఫ్రా సంస్థ హైదరాబాద్ నగర శివార్లలో పలు భారీ ప్రాజెక్టులను ప్రకటించింది. ప్రభుత్వ అనుమతులు రాకముందే, ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో మార్కెట్ ధర కంటే అతి తక్కువ ధరకే ప్లాట్లు, ఫ్లాట్లు ఇస్తామం టూ ప్రచారం చేసింది. ఈ ప్రకటనలు నమ్మి వేలాది మంది ప్రజలు తమ జీవితకాల పొదుపును సాహితి సంస్థలో పెట్టుబడిగా పెట్టారు. డబ్బులు కట్టి ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టులు ప్రారంభం కాకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

13 మందిపై అభియోగాలు, 17 కేసుల్లో ఛార్జిషీట్

సాహితి ఇన్ఫ్రా మోసాలపై ఇప్పటివరకు మొత్తం 64 కేసులు నమోదయ్యాయి. అయి తే, కేసు తీవ్రతను, బాధితుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని సీసీఎస్ పోలీసులు లో తుగా దర్యాప్తు జరిపారు. ఇందులో భాగం గా ప్రస్తుతానికి 17 కేసులకు సంబంధించి న్యాయస్థానంలో ఛార్జిషీట్ సమర్పించారు. ఈ కుంభకోణంలో ప్రత్యక్ష ప్రమేయం ఉన్న సాహితి లక్ష్మీనారాయణతో పాటు మొత్తం 13 మందిని నిందితులుగా చేర్చారు. మిగిలిన కేసుల్లోనూ దర్యాప్తు వేగవంతం చేసి నట్లు సమాచారం.

జేబుల్లోకి ప్రజల సొమ్ము

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజా లు వెలుగుచూశాయి. ప్రజల నుంచి ప్రాజెక్టుల నిర్మాణం కోసం వసూలు చేసిన వేల కోట్ల రూపాయలను సాహితి లక్ష్మీనారాయ ణ ఆయా ప్రాజెక్టులపై ఖర్చు చేయలేదని తేలింది. ఆ నిధులను తన సొంత అవసరాలకు, ఇతర వ్యాపారాలకు, ఆస్తుల కొనుగో లుకు మళ్లించినట్లు పోలీసులు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. నిధుల మళ్లింపు  వల్లే ప్రాజెక్టులు ముందుకు సాగలేదని, ఇది ఉద్దేశ పూర్వకంగా చేసిన మోసమేనని పోలీసులు స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులకు ఇప్పు డు కాస్త ఊరట లభించింది.