24-10-2025 12:00:00 AM
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి సిపిఎం వినతి
వెంకటాపురంనూగూరు), అక్టోబర్ 23(విజయక్రాంతి):భద్రాచలం నుండి వెంకటాపురం పోవు ప్రధాన రహదారి ఇసుక లారీల వల్ల గుంతలు ఏర్పడి పూర్తిగా దెబ్బతిన్నదని, తక్షణమే ఆ రహదారికి కావలసిన నిధులు మంజూరు చేసి మరమ్మత్తులు చేపట్టాలని సిపిఎం బృందం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతి పత్రం అందించడం జరిగింది.
వినతి పత్రం అందించిన వారిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూ లకంటి రంగారెడ్డి, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, పార్టీ ములుగు జిల్లా సీనియర్ నాయకులు సూడి కృష్ణారెడ్డి లు ఉన్నారు.. ఈ సంద ర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తక్షణమే తగిన నిధులు మంజూరు చేసి ఆ రోడ్డుకు మరమ్మత్తులు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.