24-10-2025 12:00:00 AM
ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్
మహబూబాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): వేగవంతంగా కేసుల దర్యాప్తు పూర్తి చేయాలని, నేర నిరూపణకు శాస్త్రీయ ఆధారాలను జోడించాలని మహబూబాబాద్ జి ల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్ కా ర్యాలయంలో గురువారం జిల్లా క్రైమ్ మీ టింగ్ నిర్వహించి కేసుల పురోగతిని సమీక్షించారు. పెండింగ్లో ఉన్న కేసులు, మహిళా భ ద్రత, సైబర్ నేరాలు, అక్రమ రవాణాలు, గంజాయి నియంత్రణ చర్యలు, ప్రజా శాంతి భద్రత అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
ప్రతి అధికారి నుండి వారి పరిధిలోని కేసుల వివరాలు తెలుసుకొని, దర్యాప్తు వేగవంతం చేయాలని, బాధితులకు న్యాయం జరిగేలా ప్రతి కేసును శాస్త్రీయ ఆధారాలతో పూర్తి చే యాలని ఎస్పీఆదేశించారు. అలాగే చట్టం అ మలు పరంగా కఠినంగా ఉండడమే కాకుం డా, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ సేవా దృక్పథంతో పనిచేయాలని సూచించారు.
ఇటీవల జిల్లాలో రైతుల కోసం నిర్వహించిన యూరియా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా, ప్రశాంతంగా జరిగేలా కృ షి చేసిన పోలీస్ అధికారులకు మెమెంటోలు అందజేసి శాలువా కప్పి ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ అభినందనలు పోలీస్ స్టేషన్ లో ఉన్న ప్రతిఒక్కరికి వర్తిస్తుందని అ న్నారు. విధుల్లో క్రమశిక్షణ, సమన్వయం, ని బద్ధతతో పాల్గొన్న అధికారుల పాత్రను ప్ర శంసిస్తూ, మహబూబా బాద్ జిల్లా పోలీస్కు రాష్ట్రస్థాయిలో పేరు తెచ్చినందుకు అభినందించారు.
క్రైమ్ మీ టింగ్ అనంతరం, కోర్ట్ డ్యూటీలో విశిష్ట సేవలందించిన సీడో సి బ్బందికి ప్రశంసా పత్రాలను ఎస్పీ స్వ యంగా అందజేశారు. విధుల్లో చూపిన నిబద్ధత, సమయపాలన, మరియు న్యాయ వ్య వస్థతో సమన్వయం చూపినందుకు అధికారులను ప్రోత్సహిస్తూ, ఇతర సిబ్బందికి స్ఫూ ర్తిదాయకంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్త్స్రలు, వివిధ యూనిట్ల ఇన్చార్జ్ అధికారులు పాల్గొన్నారు.