calender_icon.png 31 August, 2025 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా భద్రాద్రి రామాలయం మూసివేత

30-08-2025 09:28:23 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుండి పాక్షిక చంద్ర గ్రహణం సందర్భంగా భద్రాచలం దేవస్థానం కార్య నిర్వహణాధికారి కె. దామోదర్ రావు తెలిపారు. తిరిగి దేవాలయం సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున మూడు గంటలకు ఆలయం తెరిచి సుప్రభాతం ఆలయ శుద్ధి సంప్రోక్షణ ఆరాధన సేవా కాలం నివేదన నిర్వహించి ఉదయం ఏడు గంటల 30 నిమిషాలకు భక్తులకు సుప్రభాత దర్శనం కల్పించబడుతుందని ఆయన తెలిపారు. కావున భక్తులు సమయపాలన పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆయన కోరారు.