28-09-2025 05:15:00 PM
మందమర్రి (విజయక్రాంతి): స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని రిటైర్డ్ ఆర్మీ జవాన్ సింగరేణి ఎస్ అండ్ పీసీ ఉద్యోగి రాజేష్ పివ్హల్ రాణి పివ్హాల్ దంపతుల ఆధ్వర్యంలో పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ సమీపంలోని దుర్గామాత మండపం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా తెలంగాణ విద్య వంతల వేదిక రాష్ట్ర నాయకులు సీనియర్ పాత్రికేయులు హెచ్ రవీందర్ మాట్లాడారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదంతో బ్రిటిష్ సైన్యంతో పోరాడి శత్రువులను గడగడ లాడించిన గొప్ప స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్ అన్నారు.
భారత స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన భగత్ సింగ్ ప్రతి భారతీయుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారన్నారు. భరత మాత స్వేచ్ఛ స్వాతంత్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప స్వతంత్ర సమరయోధుడని అన్నారు. ఆయన యువత భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకొని అవినీతి రహిత సమాజం కోసం, దేశాభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి రచయిత సుందిల్ల రాజయ్య, ప్రముఖ వ్యాపారి, పద్మశాలి సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి దావనపల్లి తిరుపతి, గనవేన స్వామి, పాల్గొన్నారు.