calender_icon.png 28 September, 2025 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు దోహదపడాలి

28-09-2025 05:13:11 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): పుట్టి పెరిగిన తమ గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండ రామారావు మాజీ ఎంపీటీసీ రేగటి రవి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రేగటి రవి, రేగటి వెంకటేష్, రేగటి రామకృష్ణ, రేగటి నాగరాజుల సహకారంతో మండల పరిధిలోని బండ రామారం గ్రామంలో వీధిలైట్లు ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మేము పుట్టి పెరిగిన గ్రామ అభివృద్ధికి ఎంతో కొంత తనవంతుగా కృషి చేయాలనే లక్ష్యంతో గ్రామస్తుల సహకారంతో ముందుకు వెళుతున్నామని అన్నారు. ప్రజా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, పల్లెల్లో మౌలిక వసతులు లక్ష్యంగా పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మారుమూల గ్రామాలు, పంచాయితీలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ప్రజల ప్రతి అవసరాన్ని తీర్చడమే ద్వేయంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వీధిలైట్లు పంపిణీ చేసిన నాయకులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.