29-09-2025 12:41:06 AM
గద్వాల, సెప్టెంబర్ 28 ( విజయక్రాంతి ) : పియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద నీటి ఉద్ధృతి పోటెత్తింది. ఆదివారం సాయంత్రం జూరాల ప్రాజెక్టు ఎగువ జలాశయాల నుంచి జూరాలకు 5.07 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు 39 గేట్లను ఎత్తి దిగువకు 5.20లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ఎగువన ఉన్న కర్ణాటక జలాశయాల నుంచి వరద ఉధృతిక్రమంగా పెరగడంతో,
జూరా ల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షించి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలతో పాటు భీమా నది వరద ఉద్ధృతికి కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు. ప్రస్తుతం 316.910 మీటర్ల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా, ఇప్పుడు 6.569 టీఎంసీలనీరుఉంది.