calender_icon.png 17 December, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎర్రుపాలెం నూతన సర్పంచ్‌ను సన్మానించిన భట్టి విక్రమార్క

17-12-2025 12:00:00 AM

ఎర్రుపాలెం డిసెంబర్ 16 (విజయ క్రాంతి):స్థానిక సంస్థలకు జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎర్రుపాలెం మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులను మధిర శ్రీరస్తు ఫంక్షన్ హాల్ లో సన్మానించారు. మంగళవారం నాడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క   కొత్త సర్పంచ్లు తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలములోని 31 గ్రామపంచాయతీ కొత్త సర్పంచ్లుగా ఎన్నికైన వారిని సన్మానించారు.

ఎర్రుపాలెం గ్రామ సర్పంచ్ నండ్రు అశ్విని, ఉప సర్పంచ్ ఎస్ కే శాబాష్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చావా రామకృష్ణ, పంపి సాంబశివరావు, ఎర్రుపాలెం గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎస్.కె ఇస్మాయిల్ కంచర్ల వెంకట నరసయ్య, సూరంశెట్టి రాజేష్, నర్సిరెడ్డి, దేవరకొండ రాజీవ్ గాంధీ, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.