22-11-2025 10:16:39 PM
వేములవాడ టౌన్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల మొక్కుబడి సేవలు ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల నుండి నిర్వహించబడుతున్నాయి. ఆది, సోమవారం వంటి భక్తుల రద్దీ అధికంగా ఉండే రోజులలో ప్రత్యేక ఏర్పాట్లు చేయబడతాయి.
అలాగే భక్తుల సౌకర్యార్థం నిత్య అన్నదాన సత్రం పైభాగంలో ఉన్న నిత్య కళ్యాణ మండపంలో నిర్వహించబడుతుంది. భక్తులు ఈ సేవలను వినియోగించుకుని స్వామివారి సేవలు చెల్లించుకోవచ్చు. ఇక భీమేశ్వర ఆలయంలో పార్వతి రాజరాజేశ్వర స్వామి, శ్రీదేవి–భూదేవి సహిత అనంత పద్మనాభ స్వామి, ఉత్సవమూర్తులపై ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తుల సమక్షంలో నిర్వహించారు. ఈ సేవలో ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ ఆలయ అర్చకులు వేద పండితులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.