calender_icon.png 22 November, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొగ మంచుతో ఉక్కిరి బిక్కిరి

22-11-2025 10:01:53 PM

కుభీర్ (విజయక్రాంతి): కుభీర్ మండలాన్ని గత వారం రోజులుగా పొగమంచు కమ్మేస్తుంది. ప్రతిరోజు ఉదయం, సంధ్యకాలం పొగమంచు కారణంగా రోడ్ల వెంబడి వెళ్లే వాహనాలను నడిపించే వాహనదారులు రోడ్డు వెంబడి దారి కనబడకుండా పోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మండలంలో చలి తీవ్రత అధికంగా ఉండడంతో పొగమంచు కమ్మేస్తోంది. రాత్రి 8 గంటలు దాటితే ఆయా గ్రామాల్లోని ప్రజలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు. ఈ ప్రాంత రైతులు ప్రతిరోజు తెల్లవారుజామునుండే నిద్రలేచి వివిధ వ్యవసాయ పనులను చేపడుతారు.

కానీ వారం పది రోజులుగా చలి తీవ్రతతో పాటు పొగ మంచు కురుస్తుండడంతో రైతులు ఉదయం వేళలో చేలకు వెళ్లడం లేదని అంటున్నారు. గత 15 రోజుల నుండి రైతులు యాసంగి పంటలైన శనగ, మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నారు. అంతర పంటగా వేసుకున్న కంది పంటకు పొగమంచు కారణంగా పురుగు ఉధృతి పెరిగిందని అంటున్నారు. దీంతో పంటలకు అధికంగా చీడపీడలు ఆశించే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పొగమంచుతో పంటలకు చీడ పీడలు ఆశించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏఈవోలు రైతులకు అవగాహన కల్పిస్తే బాగుంటుందని మండల రైతులు కోరుతున్నారు.