22-11-2025 09:51:40 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల మహిళ సమాఖ్య ఐకెపి ఆధ్వర్యంలో శనివారం మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఐకెపి ఏపిఎం శ్రీనివాస్ మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనంతరెడ్డి, మాజీ సర్పంచ్ అంజలి శ్రీనివాస్ మహిళలకు చీరల పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ " ఇందిరమ్మ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుంది.
మహిళల సంక్షేమతో పాటు ఆర్థిక ఉన్నత కలిగించే కార్యక్రమంలో చేపట్టడం ఆడబిడ్డల పేరుతోనే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయిస్తూ రాజకీయాల్లోని మహిళలకు తగిన ప్రాథమిక కల్పించడం కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలని లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని, తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున సారే పెట్టి గౌరవించాలన్న తపనతో కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేయాలన్న నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు. దోమకొండలో 807సంఘాలు, 8420 సభ్యులకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఐరన్ నరసయ్య, డైరెక్టర్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.