22-11-2025 10:09:56 PM
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో 8 కోట్ల70 లక్షల రూపాయలతో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ అస్పత్రి భవనాన్ని శనివారం భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడి ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని గతంలో ఏ అనారోగ్య సమస్య వచ్చిన వరంగల్ ఎంజీఎంకు హైదరాబాదలోని ఆసుపత్రులకు వెళ్ళవలసి వచ్చేదని అన్నారు.
నూతన భవనంలో మౌలిక వసతులను ఇంకా బలోపేతం చేయాల్సి ఉందని ప్రత్యేకంగా డాక్టర్లు పారామెడికల్ సిబ్బంది నర్సులు తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించి వీటిని తక్షణమే భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వానికి విన్నవించారు.కనీసం ఐదు మందికి అయినా డయాలిసిస్ సేవలు అందించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే స్థానిక ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కే హైమావతి చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్ ఎంపీడీఓ ఎంపీవో మున్సిపల్ కమిషనర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.