22-11-2025 10:13:48 PM
శంకర్ పల్లి: శనివారం స్థానిక లిటిల్ స్టార్స్ హై స్కూల్ లో ఎమ్ఎన్ఆర్ డెంటల్ కళాశాల సంగారెడ్డి పాఠశాలలోని విద్యార్థులకు ఉచిత డెంటల్ శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు డెంటల్ కి సంబంధించి అన్ని పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంనికి ముఖ్య ఆతిధిగా స్థానిక శంకర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ కాశెట్టి మోహన్ హాజరయ్యారు. వారు కూడా దంత పరీక్షలు చేయించుకున్నారు. ముఖ్య అతిధులకు పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానం చేశారు అదే విధంగా డెంటల్ కళాశాల వారికి పాఠశాల యాజమాన్యం సన్మానం చేశారు. ఇంత మంచి కార్యక్రమంకి సహాయ సహకారం అందించిన ఉపాధ్యాయులకు మార్కెట్ చైర్మన్ గోపాల్ రెడ్డిని సత్కరించారు.