22-11-2025 09:51:11 PM
అసహనం వ్యక్తం చేస్తున్న బీసీ నేతలు
బెల్లంపల్లి (విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సర్వం సిద్ధమవుతోంది. తాజాగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ కు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలపడంతో వార్డు మెంబర్లు, సర్పంచుల స్థానాలకు రిజర్వేషన్లు విధివిధానాలు ఖరారయ్యాయి. బెల్లంపల్లి మండలంలోని 17 గ్రామపంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో నేతల్లో సర్వత్రా మొదలైంది.
ఆకెనపల్లి (ఎస్సీ జనరల్), అంకుశం(ఎస్సీ మహిళ), బట్వాన్పల్లి (జనరల్), బుచ్చయ్య పల్లి (జనరల్), పెద్దబూద (జనరల్), చిన్న బూద (జనరల్), చాకేపల్లి (ఎస్ టి మహిళ), చంద్రవెల్లి (ఎస్సీ జనరల్), దుగ్నేపల్లి (జనరల్ మహిళ), గురజాల (బీసీ జనరల్), కన్నాల(ఎస్సీ జనరల్), లంబడి తండా(జనరల్), లింగాపూర్ (జనరల్ మహిళ), మాల గురజాల (జనరల్ మహిళ), పాత బెల్లంపల్లి (బీసీ మహిళ), పెరికపల్లి (ఎస్టి జనరల్), సోమగూడెం(ఎస్సీ మహిళ) లకు కేటాయించారు.
స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని ప్రభుత్వం విడుదల చేసిన జీవో పట్ల బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం మోసం చేసిందని ఆందోళన చెందుతున్నారు. బెల్లంపల్లి మండలంలో స్థానిక సంస్థల్లో కేవలం రెండు స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించడం పట్ల అసహనం వ్యక్తం అవుతుంది.