22-11-2025 10:04:40 PM
జిల్లా విద్యాశాఖ అధికారి(DEO) దర్శనం భోజన్న..
కుభీర్ లోని కేజీబీవీ, ఉన్నత పాఠశాల, కాంప్లెక్స్ సమావేశాల సందర్శన..
కుభీర్ (విజయక్రాంతి): కసితో కష్టపడి చదవడం ద్వారా జీవితంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని నిర్మల్ జిల్లా విద్యా శాఖ అధికారి దర్శనం భోజన్న విద్యార్థులకు సూచించారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని శనివారం అయన సందర్శించారు. ఈ సందర్భంగా అయన నాబార్డ్ నిధులు రూ. 50 లక్షలతో నిర్మించబోయే అదనపు గదుల కోసం స్థలాన్ని పరిశీలించారు. అక్కడే ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల్లో కనీస సమర్త్యాలను పరిశీలించారు. అనంతరం హాజరు రిజిస్టర్లను, స్టాక్ బుక్ లను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించి, నాణ్యమైన విద్యను అందించాలని ఎస్ వో కు సూచించారు.
పదో తరగతి లో 100% ఉత్తిర్ణత సాధించాలని ఆదేశించారు. అనంతరం 10 తరగతి క్లాస్ రూమ్ కు వెళ్లి సదుపాయాలు లేని రోజుల్లో చదివి ప్రయోజకులు అయ్యామని, ప్రస్తుత కాలంలో అందరికి అన్ని సదుపాయాలు ఉన్నాయని వాటిని వినియోగుంచుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని పేర్కొన్నారు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన జ్ఞాన సముపార్జన, నైపుణ్యాలను సంపాదించడంలో క్రమశిక్షణ ఎంతగానో దోహదపడుతుందని సూచించారు. నిరంతరం నేర్చుకోవడం మీ మనస్సును తాజాగా ఉంచుతుందని దీంతో పరీక్షల్లో 100% మార్కులు సాధించవచ్చని వివరించారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న కాంప్లెక్స్ సమావేశాలు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎంఈఓ విజయ్ కుమార్, ఎస్ ఓ వాణి, డిఈ వో కార్యాలయ అధికారులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.