22-11-2025 09:54:22 PM
తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో శనివారం భవాని దుర్గ నాయకమ్మ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భవాని మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే యజ్ఞం చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్యన ఉత్సవాలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఉత్సవ కార్యనిర్వాకులు అంబీర్ మనోహర్ రావు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం దుర్గా భవాని నాయకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని మాతను ప్రార్థిస్తున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో డిఇఓ రాజు, గుడిమెట్ పీఠాధిపతి మహాదేవ మహారాజు, ఎంఈఓ రామస్వామి, ప్రతినిధులు భువనేశ్వర్, రాజిరెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.