calender_icon.png 22 November, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ చాటిన సన్ షైన్ విద్యార్థులు

22-11-2025 09:57:10 PM

చండూరు,(విజయక్రాంతి): ఇటీవల నకిరేకల్ జరిగిన ఇంటర్ స్టేట్ షోటోకాన్ స్టేట్ లెవెల్ చాంపియన్షిప్ పోటీలలో స్థానిక సన్ షైన్ పాఠశాల విద్యార్థులు పాల్గొని ఫిదియాన్ ఎనిమిదవ విభాగంలో గోల్డ్ మెడల్, సౌద్ ఏడవ విభాగంలో గోల్డ్ మెడల్, విగ్నేష్ 6వ విభాగంలో గోల్డ్ మెడల్, ఐదవ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. శనివారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో కరాటేలో ప్రతిభ చాటిన ముగ్గురు విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ కోడి వెంకన్న  మెమొంటో అందించి అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ... కరాటే ద్వారా శారీరిక దారుఢ్యం, దృఢత్వంతో పాటు మానసిక పరిపక్వత పెంపొందించుకోవచ్చునని, క్రమశిక్షణ అలవర్చుకోవడం ద్వారా ఉత్తమ భావి భారత పౌరులుగా ఎదగవచ్చునని ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవడంలో కరాటే శిక్షణ కీలకమని అన్నారు. సమాజంలో చదువుతోపాటు బహుముక ప్రజ్ఞాశీలులై ఉండడం ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోడి సుష్మ, వినయ్, లతీఫ్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు,  విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.