calender_icon.png 4 May, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీమిరెడ్డి నరసింహారెడ్డి స్థూపావిష్కరణ సభను జయప్రదం చేయండి

03-05-2025 04:40:52 PM

ఎం సిపిఐ యూ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న

తుంగతుర్తి (విజయక్రాంతి): శ్రీరామ్ సాగర్ రెండవ దశ సాధన ప్రదాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఎం సిపిఐ యూ పోలిటి బ్యూరో బ్యూరో సభ్యులు ఎర్ర జెండా ముద్దుబిడ్డ కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి మాజీ ఎంపీ 17వ వర్ధంతి సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్రంలో జరిగే స్తూపావిష్కరణ సభను జయప్రదం చేయగలరని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

ఈరోజు తుంగతుర్తి మండల కేంద్రంలో పత్రికా విలేకరుల సమావేశంలో వెంకన్న మాట్లాడుతూ... తుంగతుర్తి మండలం కరిరాల కొత్తగూడెం గ్రామంలో ధనిక భూస్వామ్య కుటుంబంలో జన్మించిన బి.యన్ రెడ్డి చిన్న వయసులో ఎర్రజెండా చేతబట్టి పేద ప్రజల కోసం పోరాటం చేశారని రెండుసార్లు ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎంపీగా ప్రజలు గెలిపించుకున్నారని పార్లమెంట్ అసెంబ్లీలలో ప్రజల కోసం నిత్యం పోరాటాలు నిర్వహించి శ్రీరామ్ సాగర్ రెండో దశ కాలువను సాధించారని రామన్నపేట నుండి నడికుడి వరకు రైలు మార్గాన్ని సాధించిన గొప్ప పోరాట యోధుడు ఆ పోరాట వీరుడి స్మారకార్థం తుంగతుర్తి మండల కేంద్రంలో వర్ధంతి సందర్భంగా స్తూపావిష్కరణ సభ నిర్వహించడం జరుగుతుందని ఈ సభకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్ది కాయల అశోక్ ఓంకార్  రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాదగోని రవి  స్థానిక శాసనసభ్యులు మందుల సామెల్  తో పాటు మాజీ శాసనసభ్యులు వామపక్ష పార్టీల నాయకులు హాజరవుతున్నారని కావున ప్రజలు ప్రజాతంత్ర వాదులు భీమి రెడ్డి అభిమానులు అనుచరులు సహచరులు హాజరై స్థూపావిష్కరణ సభను జయప్రదం చేయగలరని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

ఈ సమావేశంలో తుంగతుర్తి డివిజన్ కార్యదర్శి నలుగురి రమేష్ అర్వపల్లి మండల కార్యదర్శి వేముల పెద నర్సయ్య పార్టీ నాయకులు సందుపట్ల పవన్ కళ్యాణ్ నరసయ్య రాములు తదితరులు పాల్గొన్నారు