calender_icon.png 4 May, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీళ్లు లేని బావిలో పడ్డ చిన్నారులు

03-05-2025 04:42:33 PM

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలురు...

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం సంగమేశ్వర కాలనీలో శనివారం రాహేల (7), ఇర్ఫాన్ (6) అనే చిన్నారులు ఆడుకుంటూ నీళ్లు లేని రింగుల బావిలో పడ్డారు. తీవ్ర గాయాలపాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఆసుపత్రి డాక్టర్ శ్రీను నాయక్ తెలిపారు. కుళాయిలు రావడంతో బావి పై సిమెంట్ మూతలు పెట్టి పట్టించుకోకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.