calender_icon.png 4 May, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రాగునీటి సమస్యను పరిష్కరించాలి

03-05-2025 04:38:06 PM

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని పొన్నారం గ్రియన్సింలోని 1వ వార్డులో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గ్రామస్థులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. శనివారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా గ్రామస్థులు మాట్లాడారు. గత రెండు నెలలుగా కాలనీకి తాగు నీటి సరఫరా లేకపోవడంతో కాలని వాసులు తాగు నీటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తుందని కాలని వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాగునీరు సరఫరా చేస్తున్న పైపు లైన్లను తవ్వడంతో తాగు నీటి సరఫరా నిలిచి పోయింద ని వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని కార్యదర్శికి విన్నవించినప్పటికి ఆయన పట్టించుకున్న దాఖలాలు లేవని వారు మండి పడ్డారు. మండల అదికారులు స్పందించి ప్రస్తుత వేసవిని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ గిరిధర్ రావు కు అందచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు బొక్కల భవాని, దేవమ్మ, భారతి, లక్ష్మి, బొర్లకుంట మధులత, మల్లేపల్లి రాజక్క, గోదారి విజయ లు పాల్గొన్నారు.