14-01-2026 05:14:41 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): నూతనంగా గెలుపొందిన సర్పంచ్, ఉపసర్పంచ్‌లు గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు సూచించారు. బుధవారం బాబాపూర్ సర్పంచ్ రాజన్న, ఉపసర్పంచ్ కిష్టయ్యలను ఆయన శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అరిగెల మాట్లాడుతూ... గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని, అనంతరం అందరితో కలసి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షుడు సుంకరి పెంటయ్య, నాయకులు మల్లేష్ యాదవ్, ఇందులాల్, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.