calender_icon.png 14 January, 2026 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో ముగిసిన ధనుర్మాస వేడుకలు

14-01-2026 05:22:04 PM

అర్చకుల కు ఘన సన్మానం

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గత నెల రోజులుగా కొనసాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు బుధవారం ముగిసాయి. డిసెంబర్ 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. 30 రోజులపాటు తెల్లవారుజామున ప్రతిరోజు 5 గంటలకు పూజా కార్యక్రమాలు ప్రారంభమై ఎనిమిది గంటల వరకు కొనసాగాయి ప్రతిరోజు తిరుప్పావై సంబంధించిన 30 పాశురాలను భక్తులు సామూహికంగా అనుసంధానం గావించారు,

అర్చకులు సౌమిత్రి శ్రావణ్  హరిణి దంపతులు ప్రతిరోజు ఈ పాసురాలను భక్తులతో అనుసంధానం చేయించారు. తిరుప్పావై వేడుకల్లో భాగంగా గోదా రంగనాయకుల కళ్యాణం రెండు రోజుల క్రితం నిర్వహించారు. బుధవారం 30వ పాశురం అనుసంధానంతో ధనుర్ మాస వేడుకలు ముగిశాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 30 రోజులపాటు ఘనంగా ధనుమాస వేడుకలను నిర్వహించిన శ్రావణ్ కుమార్ హరిణి దంపతులను ఆలయ భక్త బృందం ఘనంగా సత్కరించారు, వారి సేవలను కొనియాడారు.