calender_icon.png 14 January, 2026 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణ కళలను ప్రోత్సహించేందుకు ముగ్గుల పోటీలు

14-01-2026 05:11:46 PM

మంచరామి సర్పంచ్ లక్ష్మి

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): గ్రామీణ కళలను ప్రోత్సహించేందుకు ముగ్గుల పోటీలు ఎంతో  దోహదపడతాయని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం   మంచరామి సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల సహాయక కార్యదర్శి ఉప్పు లక్ష్మి అన్నారు. బుధవారం  సుల్తానాబాద్ మండలంలోని మంచరామి గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని  సర్పంచ్ ఉప్పు లక్ష్మి_తిరుపతి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.

గ్రామంలో  ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు. హరి దాసుల ఆటలు, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జడ్జిలుగా లక్ష్మణ్, శారదలు   వ్యవహరించారు. అనంతరం విజేతలకు సర్పంచ్ ఆధ్వర్యంలో బహుమతులను అందజేశారు. మొదటి, రెండవ, మూడో బహుమతితో పాటు ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక మహిళకు ప్రోత్సాహ  బహుమతులను  అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎగుర్ల శ్రీనివాస్, వార్డు సభ్యులు, మహిళలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.