calender_icon.png 6 July, 2025 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూసమస్యల శాశ్వత పరిష్కారం కోసమే భూభారతి

12-06-2025 01:43:19 AM

ఎమ్మెల్సీ శంకర్ నాయక్

మిర్యాలగూడ, జూన్ 11 : రైతులు తమ భూములపై హక్కుల్ని కోల్పోకుండా చట్టపరంగా వారికి భద్రత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంతోనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. భూభారతి అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులలో బుధవారం దామచర్ల మండలం దిలావ ర్ పురం గ్రామంలో నిర్వహించిన రెవిన్యూ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రూపొందించిన భూభారతి చట్టం రైతులకు వరం లాంటిద న్నారు. 

గత ప్రభుత్వ హయాంలో ఉన్న ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యలు జఠి లమయ్యాయని, దీంతో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారన్నారు . తెలంగాణ ప్రభుత్వం వీటి పరిష్కారానికి ఎంతో అధ్యయనం చేసి రూపొందించిన భూభారతి చట్టంలో అధికారాల వికేంద్రీకరణ, ట్రిబ్యూ నల్స్ ఏర్పాటు తదితర సౌకర్యాలు కల్పన ద్వారా రైతుల భూ సమస్యలు సులభతరంలో పరిష్కారం అవుతాయన్నారు.

చట్టంలోని పలు సెక్షన్లు, వాటి వివరాలను, కలిగే ప్రయోజనాలను వివరించారు. రెవిన్యూ సదస్సులలో ప్రజాస్పందన విశేషంగా ఉందన్నారు. ఆగస్టు నాటికి పూర్తిస్థాయిలో భూ సమస్యల పరిష్కారం దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ జవహర్లాల్. ఆర్ ఐ సురేందర్ సింగ్. మాజీ ఎంపీటీసీ బెజ్జం సాయి, అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు