calender_icon.png 27 August, 2025 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతితో రెతులకు మేలు

24-04-2025 12:00:00 AM

  1. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

జొన్న కొనుగోలు ప్రారంభించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ రాజర్షి షా

ఉట్నూర్, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి) :  రైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్ట ల్ వ్యవస్థను బంగాళాఖాతంలో కలిపేస్తామని, ఆనాడు మాటీచ్చి నేడు ఆ మాటను నిలబెట్టుకొని రైతులకు అండగా నిలుస్తున్నామని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యు డు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషాతో కలిసి ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ.. బడా బాబుల అవినీతి అస్త్రంగా మారినా ధరణి పోర్టులను నేడు ప్రజా ప్రభు త్వం రద్దు చేసి భూభారతి చట్టాన్ని రూపొందించి రైతులకు మేలు చేకూరేలా చర్యలు చేపడుతోందని అన్నారు. ప్రతి ఒక్క సామా న్య వ్యక్తి భూ సమస్యలు భూభారతి చట్టం ద్వారా మండల స్థాయిలోనే పరిష్కరించబడతాయని తెలిపారు.

అనంతరం కలెక్టర్ రాజర్షిషాతో కలిసి వ్యవసాయ మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అదేవిధంగా కల్యాణ లక్ష్మీ, షాది ముభారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, జాయింట్ కలెక్టర్ శ్యామల దేవి, తహసీల్దార్ ప్రవీణ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖాడే ఉత్తం, జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బానోత్ జైవంత్, వ్యవసాయ శాఖ అధికారి గణేష్ రాథోడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.