23-04-2025 10:52:11 PM
గజ్వేల్: గజ్వేల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామి వారి ఎదుర్కోలను ఘనంగా నిర్వహించారు. గజ్వేల్ వెంకటేశ్వర ఆలయం నుండి డప్పు కళాకారుల భారీ ప్రదర్శనతో, వివిధ దేవత అలంకరణలతో, విద్యుత్ దీపాల వెలుగులతో ఎదుర్కోలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. అంగడిపేట హనుమాన్ ఆలయం వద్ద స్వామివారిని ఎదుర్కొని వెంకటేశ్వర స్వామి ఆలయానికి తీసుకువచ్చారు. గురువారం స్వామివారి కల్యాణాన్ని నిర్వహించనున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శేషం శ్రీనివాస్ ఆచార్యుల వైదిక నిర్వహణలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.