24-10-2025 12:00:00 AM
* ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్యా వసతి కల్పించాలి
* జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
కల్వకుర్తి అక్టోబర్ 23 : భూ భారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కల్వకుర్తి ఆర్డీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూ భారతి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై చర్చించారు. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రతి మండలంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల సంఖ్య, వాటి పరిష్కార స్థితి, కారణాలను ఆర్డీవో జనార్దన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ భూములు, దేవాదాయ భూముల వివరాల రికార్డులను కలెక్టర్ పరిశీలించారు.
భూములకు సంబంధించిన డిజిటల్ రికార్డుల్లో లోపాలు లేకుండా ఉండాలని, భూస్వాముల వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు, వివాదాస్పద భూముల రికార్డులు స్పష్టంగా ఉండేలా చూసుకోవాలని, ఏదైనా గందరగోళం, అస్పష్టత ఉంటే వెంటనే దానిని సరిచేయాలని సూచించారు. రెవెన్యూ సిబ్బంది, ఆర్డీవో, తహసీల్దార్లు, విఆర్వోలు అందరూ భూభారతి చట్టంలోని ప్రతీ మాడ్య్పూ పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో సాక్ష్యాధారాలు సేకరించి నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. కల్వకుర్తి లోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తో కలిసి సందర్శించారు. అంతకుముందు కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగాసందర్శించారు.