calender_icon.png 29 November, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి పెండింగ్ దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలి

29-11-2025 12:00:00 AM

కలెక్టర్ ఆశిష్ సంగువాన్

కామారెడ్డి, నవంబర్ 28 (విజయక్రాంతి): భూ భారతి, రెవెన్యు  సదస్సుల పెండింగ్ దరఖాస్తులు, విద్యార్ధులకు అందించే సర్టిఫికెట్స్‌లపై శుక్రవారం సాయంత్రం ఆర్డీఓ, తహసిల్దార్లతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూ భారతి రెవెన్యూ సదస్సులలో స్వీకరించిన పెండింగ్ దరఖాస్తుల పై మండలాల వారీగా రెవెన్యూ అధికారులతో క్షేత్రస్థాయిలో సమగ్ర సమీక్ష నిర్వహించారు.

సమీక్ష సందర్భంగా వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత మాడ్యూల్ లో ఎన్ని పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ ,  నోటీసులు జారీచేసిన వివరాలు అలాగే క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అన్ని వివరాలను ఆన్లైన్లో సమగ్రంగా అప్లోడ్ చేసిన వాటిపై ఆరా తీశారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకునుగుణంగా సాదాబైనామా దరఖాస్తులను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

తిరస్కరణకు గురైన దరఖాస్తుల విషయంలో స్పష్టమైన, వివరణాత్మక కారణాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. దరఖాస్తులు అందిన వెంటనే అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వెంటనే మంజూరీ జాబితాలను పంపాలని నిర్దేశించారు. ఆధార్ కోసం అవసరమైన విద్యార్థులకు జనన ధృవీకరణ పత్రాలను అత్యంత త్వరితగతిన జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ విక్టర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.