calender_icon.png 29 November, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ ప్రక్రియలో పొరపాట్లు లేకుండా చూడాలి: కలెక్టర్

29-11-2025 12:00:00 AM

తాండూరు, 28 నవంబర్, (విజయక్రాంతి) : సర్పంచ్ మరియు వార్డు సభ్యుల పదవి కోసం అభ్యర్థులు దాఖలు చేసే నామినేషన్ ప్రక్రియ తప్పులు పొరపాట్లు లేకుండా సంబంధిత అధికారులు జాగ్రత్తలు పాటించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. 

శుక్రవారం  ఆయన  పెద్దేముల్, యాలాల్ మండలాల్లో ఎంపీడీవోలు రతన్ సింగ్ , శ్రీనిజ లతో కలిసి నామినేషన్ల  ప్రక్రియను క్లస్టర్ల వారిగా పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులతో  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ....   అవసరానికి అనుగుణంగా సిబ్బందిని పెంచుకోవాలని.... నామినేషన్లు దాఖలు చేసే క్రమంలో కావలసిన ధృవ పత్రలను సమర్పించడం లాంటి విషయాలను అభ్యర్థులకు తెలియజేయాలని ఆయన తెలిపారు. నామినేషన్ల ఫారాలను స్పష్టంగా చూసి వాటిల్లో ఏవైనా తప్పులు వుంటే సరిచేసుకునే విధంగా అభ్యర్థులకు సహకరించాలని కలెక్టర్ సూచించారు.

ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలన్నారు.   గ్రామపంచాయతీలో పోటీ చేసే అభ్యర్థలకు వ్యయాలకు సంబంధించి  బ్యాంకు ఖాతలు ఉండాలని ఆయన సూచించారు.  సర్పం, వార్డు మెంబర్లు నిబంధనలకు అనుగుణంగానే ఖర్చులు పెట్టాలనే విషయము అభ్యర్థులకు స్పష్టంగా తెలియ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఇంకా కలెక్టర్ వెంట రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఉన్నారు.