23-05-2025 12:00:00 AM
పవన్‌కల్యాణ్, హరీశ్‌శంకర్ కలయికను మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌గా చెప్తారు. ఈ కాంబోలో రూపుదిద్దుకుంటున్న మరో చిత్రమే ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. చాలా రోజుల క్రితమే ప్రకటించినప్పటికీ పవన్‌కల్యాణ్ కారణంగా ఈ సినిమా పట్టాలెక్కలేదు. అయితే, ఇటీవల ‘హరిహర వీరమల్లు’ను పూర్తిచేసిన పవన్ ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు.
ఈ విషయాన్ని టీమ్ అధికారికంగా వెల్లడించింది. పవన్‌కల్యాణ్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు అర్థం వచ్చేలా టీమ్ ఓ పోస్టర్‌ను డిజైన్ చేసింది. దీన్ని సోషల్‌మీడియాలో షేర్ చేసిన డైరెక్టర్ హరీశ్‌శంకర్.. ‘ఇక మొదలెడదాం..’ అని క్యాప్షన్ ఇచ్చారు. టీమ్ తెలిపిన మేరకు జూన్ నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది.
ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా ఆశుతోష్ రానా, నవాబ్ షా, ‘కేజీఎఫ్’ ఫేమ్ అవినాష్, గౌతమి, నాగమహేశ్, టెంపర్ వంశీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీప్రసాద్; ఫైట్స్: రామ్-లక్ష్మణ్; ప్రొడక్షన్ డిజైన్: ఆనంద్ సాయి; ఎడిటర్: ఉజ్వల్ కులకర్ణి; స్క్రీన్‌ప్లే కథ: దశరథ్, రమేశ్‌రెడ్డి.